బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేసే ప్రాజెక్ట్ లకు సంబంధించి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతూ వాటి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు కూడా రెండేళ్ళు కేటాయించారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాకు అయితే నాలుగేళ్ళకు పైగా కేటాయించారు.
వాస్తవానికి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు పదేళ్ళ క్రితమే ఆయన ప్లాన్ చేసారు. అప్పుడే ఒక కథను మహేష్ బాబు కోసం సిద్దం చేసారు. ఆ కథ కూడా మహేష్ వినడం జరిగింది అని టాక్. అప్పుడు మహేష్ బాబుకి కథలో కొన్ని మార్పులు అడగడంతో అది కాస్తా ఆలస్యం కావడం, మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీ కావడంతో ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు అని సమాచారం.
బాహుబలి సినిమా తర్వాత మహేష్ బాబుతో చేయాలని రాజమౌళి అనుకున్నారు. అయితే అప్పటికే చిరంజీవి మాట్లాడటంతో మల్టీ స్టారర్ సినిమాను రామ్ చరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి మొదలుపెట్టారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఎట్టకేలకు పట్టాలు ఎక్కుతుంది. ఈ సినిమా కథ ఇప్పటికే సిద్దం కాగా మధ్యప్రదేశ్ లో భారీ సెట్ కూడా నిర్మాణం జరుగుతుందని ఏప్రిల్ తర్వాత షూట్ మొదలుపెట్టె అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు… త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు.