మహేశ్ బాబు సినిమా కోసం సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.అయితే ఈ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్నప్పటీకి కూడా మరో సినిమా షూట్ సగం కూడా పూర్తి చేయలేదు.
మహేష్ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కారణంగా ఈ సినిమా స్టార్ట్ అయిన కూడా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.దీంతో ఈసారి మహేష్ ను త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఫుల్ స్వింగ్ లో యాక్షన్ సన్నివేశాలను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు మరొక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా నటిస్తుంది అని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో కీలక పాత్ర ఉందని అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని. ఆ పాత్ర కోసం త్రివిక్రమ్ ఈమెను సంప్రదించినట్టు తెలుస్తుంది.ఐశ్వర్య రాయ్-మహేష్ బాబు పాత్రల మధ్య ఇంట్రెస్టింగ్ గా కథ ఉండనుందని తెలుస్తుంది.