సర్కారువారి పాట ఇంకా థియేటర్లలో కొనసాగుతోంది. మొదటి వారం వచ్చిన స్థాయిలో కాకపోయినా, ఇప్పటికీ ఈ సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. ఇప్పుడీ మూవీకి కలెక్షన్లు పెంచేందుకు మేకర్స్ సరికొత్త ప్రచారాస్త్రాన్ని ప్రయోగించారు. ఇందులో భాగంగా ప్రేక్షకులకు ఓ బోనస్ అందిస్తున్నాడు మహేష్.

మరోవైపు ఈ సాంగ్ పై సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు. సినిమాలో ఆల్రెడీ హిట్టయిన మ..మ..మహేషా పాట కంటే మురారివా సాంగే తనకు బాగా ఇష్టమని, ఆ పాట కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని అంటున్నాడు. ఈ పాటకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంది. మహేష్-కీర్తి సురేష్ కెమిస్ట్రీ మరోసారి రిపీట్ అయింది
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. మహేష్ ఇందులో సరికొత్తగా కనిపించి, అందర్నీ ఆకట్టుకున్నాడు.