కరోనా వైరస్ కారణంగా సినీ ప్రముఖులు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లాక్ డౌన్ కాలాన్ని తన కుమార్తె సితారతో కలిసి బాగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. షూటింగ్ లు నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన మహేశ్ బాబు తనయతో కలిసి తాజాగా స్టూవర్ట్ లిటిల్ అనే సినిమా వీక్షిస్తూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.
“ఇది తండ్రీకుమార్తెలకు ప్రత్యేకం! స్టూవర్ట్ లిటిల్ పార్ట్ వన్ వస్తోంది. రేపు పార్ట్ 2 వరకు వేచి ఉండలేం! మనందరం ఇంటివద్ద ఏదో ఒకటి చేసేందుకు ఆలోచిస్తూనే ఉండాలి. మనకిష్టమైన వాళ్లు ఎలాగూ మనల్ని వదిలిపెట్టరు కదా!” అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఇంటివద్దే ఉండి కరోనా నుంచి కాపాడుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు.
Father & Daughter exclusive! #StuartLittle❤️ Streaming now! #Lockdown mode? Can’t wait to watch part 2 tomorrow? Let's all find our little something to do at home… loved ones will pull us all through this?#StayHomeStaySafe?? pic.twitter.com/lNuZfxwF3f
— Mahesh Babu (@urstrulyMahesh) April 3, 2020