కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగ్ లు సైతం లేకపోవటంతో ఇంట్లోనే కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ టచ్ లో ఉంటున్నారు. ఇక మహేష్ బాబు ఈ వరుసలో కాస్తా ముందున్నాడు. తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత ఓ ఫోటో ను పోస్ట్ చేశారు.
ఆ ఫొటోలో మహేష్ బాబు తన కూతురితో స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటున్నాడు. స్విమ్మింగ్ పూల్ లో ఉంటె వింత ఏముంది అనుకుంటున్నారా… ఆ ఫొటోలో మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించాడు. మహేష్ ఇప్పటివరకు తన సినిమాలో షర్ట్ తీసింది లేదు. ఎప్పుడూ కూడా షర్ట్ లేకుండా కనిపించలేదు. షర్ట్ తీయాల్సి వస్తుందని మహేష్ సినిమాలు వదిలేశాడనే గుసగుసలు కూడా అప్పట్లో చాలానే ఉన్నాయి.