స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. వసూళ్ళ పరంగా కూడా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా చూసిన సినీస్టార్స్ ఒక్కొక్కరుగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ లు చేస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ పుష్ప అద్భుతం, సెన్సేషనల్ అండ్ ఒరిజినల్… సుకుమార్ తన సినిమా రా, రిస్టిక్, బ్రూటల్లీ హొనెస్ట్ అని మళ్ళీ నిరూపించారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు మహేష్.