పాతశ్రీకాకుళం: ప్రిన్స్ మహేష్ బాబు రియల్ హీరోగా మానవతను చాటుతున్నాడు. మహేష్ ఔదార్యం చూసి ఫాన్స్ తోపాటు అంతా శభాష్ అంటున్నారు. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి శస్త్రచికిత్స చేయించేందుకు సినీ నటుడు మహేశ్‌బాబు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకువచ్చారు. ఈ విషయం మహేశ్‌బాబు సేవాసమితి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఉంకిలి శ్రీనివాసరావు తెలిపారు.
టెక్కలి ప్రాంతానికి చెందిన 13 నెలల చిన్నారి సందీప్ గుండెవ్యాధితో బాధపడుతున్నాడు. గుండెలో మూడు రంధ్రాలు ఉన్నట్లు, శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. పేదరికంలో ఉన్న చిన్నారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. దీంతో దాతల సాయం కోసం ప్రయత్నించగా మహేశ్‌బాబు శ్రీకాకుళం జిల్లా సేవాసమితి స్పందించింది.
చిన్నారి గుండె జబ్బు గురించి హీరో మహేశ్‌బాబుకు సేవాసమితి వారు తెలిపారు. మహేష్ స్పందించి విజయవాడలో ఆంధ్రా హాస్పటల్‌లో చిన్నారి సందీప్‌కు శస్త్రచికిత్స చేయించేందుకు హామీ ఇచ్చారని మహేశ్‌బాబు సేవాసమితి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఉంకిలి శ్రీనివాసరావు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులకు మహేష్ బాబు సహాయం గురించి తెలియజేశామని, ఈనెల 14న శస్త్రచికిత్స చేయిస్తామని వివరించారు.