సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ బాబు అంత్యక్రియలకు సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా కారణంగా హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అంత్యక్రియలు జరిగిన రోజు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మహేష్ బాబు.
మరో జన్మంటూ ఉంటే మీరే ఎప్పటికీ నా అన్నయ్య… మిమ్మల్ని ఇప్పుడు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.. అంటూ చెప్పుకొచ్చారు.
కాగా శనివారం జరిగిన రమేష్ బాబు పెద్దకర్మకి హాజరయ్యారు మహేష్. ఈ కార్యక్రమంలో అన్నయ్య చనిపోయిన రోజు రాలేకపోయానని బాధపడుతూ.. మహేష్ కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు ప్రయత్నం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు.