సూపర్ మహేష్ బాబు వరుస సక్సెస్ లతో మంచి జోష్ మీద ఉన్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సూపర్ హిట్ లు అందుకున్న మహేష్ ఇప్పుడు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీస్, 14 రీల్స్, జీఎంబి బ్యానర్స్ లో వస్తున్నఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇకపోతే మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. మహేష్ బాబు రూపాయి కాయిన్ ను టాస్ వేసే సీన్ తో కూడిన పోస్టర్ ఇది. థమన్ ఇచ్చిన బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత హైలైట్ అయ్యింది.