ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల తన కుటుంబ విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో తరుచుగా పంచుకుంటున్నారు. ఆయన భార్య నమత్ర శిరోద్కర్ సైతం భర్త మహేశ్ బాబు, కూతురు సితారా, కొడుకు గౌతమ్ ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా మహేశ్ బాబు తన కుటుంబ సభ్యలతో కలిసి ప్యారిస్ కు వెళ్లారు. అక్కడ వారితో సంతోషంగా గడిపారు. ఆ సంతోష క్షణాలను తాజాగా అభిమానులకు ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అందులో బెడ్ పై మహేశ్ పడుకొని ఉండగా.. పక్కనే సితారా కూర్చుని ఉంది. ఆమె పక్కనే ఓ పిల్లి కూడా ఉంది. ఆ పిక్ కు ‘ లిబ్రిస్టోల్ ప్యారీస్ లో సోక్రటేతో కపటం లేని సంభాషణలు’ అని క్యాప్షన్ పెట్టారు.
ఇదిలా ఉంటే, మహేశ్ బాబు సర్కారు వారి పాట ఈ నెల 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రస్తుతం ఆయన పారీస్ లో ఉన్నారు. ఇండియాకు రాగానే సినిమా ప్రమోషన్స్‌లో మహేశ్ జాయిన్ అవుతారని చిత్ర బృందం చెబుతోంది.