కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ లు లేకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ నేపథ్యంలోనే పలు వెబ్ సిరీస్ లను చూస్తూ ఆ వెబ్ సిరీస్ లపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నాడు. కాగా ఢిల్లీ క్రైమ్ సిరీస్ పై మహేష్ ప్రశంసలు కురిపించారు. బెస్ట్ డ్రామా సిరీస్ గా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు సొంతం చేసుకోవడం పై కంగ్రాట్స్ తెలిపారు. మీ కృషికి దక్కిన సరైన ఫలితమిది అంటూ ట్వీట్ చేశారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ను ఆధారంగా చేసుకొని అలాంటి హింసాత్మకమైన ఘటనకు పాల్పడిన వ్యక్తిని కనిపెట్టడం అనే అంశంతో ఈ సిరీస్ ను చిత్రీకరించారు. గతేడాది నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సిరీస్ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ఇప్పటికే ఎమ్మీ అవార్డును సొంతం చేసుకోవడం పట్ల బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, కరణ్ జోహార్, అతిథి రావు హైదరి, సోషల్ మీడియా వేదికగా యూనిట్ కి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ లు చేశారు.