లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యి… ఇంట్లో వంట పని, ఒంటి పని చేస్తూ సమయాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం.. తన ఫ్యామిలీతో జాలీగా గడుపుతున్నారు. షూటింగ్ సమయాల్లో కూడా కొంచెం టైం దొరికిన ఫ్యామిలీతో బయటకు వెళ్లే మహేష్ బాబు ఇప్పుడు షూటింగ్ లు లేకపోవటంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.
కూతురు సితార, కొడుకు గౌతమ్‌లతో కలిసి టైమ్ పాస్ చేస్తున్నాడు. తాజాగా నమ్రత ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పిక్ లో మహేష్ గౌతమ్ లు తండ్రి కొడుకుల్లాగా కాకుండా.. అన్నాదమ్ముళ్ల కనిపిస్తున్నారు. అభిమానులు కూడా గౌతమ్ కు అన్నలా ఉన్నావంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.