పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా కర్నూలులో సర్కారు వారి పాట విజయోత్సవ వేడుకలు నిర్వహించింది.
అయితే, ఈ సక్కెస్ మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్ వేదికపైకి వెళ్లి ‘మమ మహేశా’ పాటకి డ్యాన్సర్లతో స్టెప్పులు వేశారు. ఆ తర్వాత మహేశ్ బాబు స్టేజ్ పైకి వెళ్లి డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడ ఉన్న అభిమానులు అరుపులతో ఊగిపోయారు. తమ అభిమాన హీరో లైవ్‌లో స్టెప్పులేయడాన్ని చూసి ఫ్యాన్స్ ఆనందపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనంతరం ఈ వేడుకలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఇది సక్సెస్ సెలబ్రేషన్‌లా లేదు. వంద రోజుల వేడుక చేసుకున్నట్టుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. సర్కారు వారి పాట విజయం తనతో పాటు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.
‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్ట్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో మహేశ్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటించింది.
ఇక మహేష్ బాబు వరుసగా ఇది నాల్గొ విజయం. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి హాట్రిక్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో సర్కారి వారి పాట సినిమా కూడా చేరింది.