సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ పెడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు సితార పాప ఓ వెబ్ సిరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైంది. త్రీడీ యానిమేషన్ వెబ్ సిరీస్ ఫెంటాస్టిక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైంది.
ఈ వెబ్ సిరీస్ పోస్టర్ ఆవిష్కరణ ప్రోగ్రామ్ బుధవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నమ్రత, సీతారతో పాటు బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూఫియా హాజరయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మొదటి సీజన్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతుంది.