టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న ఇమేజ్ అందరికి తెలిసిందే. అగ్ర హీరోగా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఉన్న హీరోలలో గ్లామర్ పరంగా చూస్తే మహేష్ ముందు వరుసలో ఉంటాడు. ఇక అమ్మాయిల ఫాలోయింగ్ మహేష్ బాబుకి ఇప్పటికి కూడా తగ్గలేదు అనే చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలతో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ లో త్రివిక్రమ్ సినిమాతో ముందుకి రానున్నాడు.
సర్కారు వారి పాట సినిమా మహేష్ బాబుకి అనుకున్న విధంగా ఫలితాన్ని ఇవ్వలేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంచితే మహేష్ బాబు కి ఒక నెల కలిసి రావడం లేదు అంటున్నారు సినిమా జనాలు. అసలు ఏంటి ఆ నెల అనేది ఒకసారి చూద్దాం. అక్టోబర్ నెలలో మహేష్ సినిమా విడుదల అయితే కచ్చితంగా ఫ్లాప్ అంటున్నారు. బాబీ సినిమా 2002… అక్టోబర్ 31న విడుదల కాగా దారుణంగా ఫ్లాప్ అయింది.
మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమా కూడా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక అక్టోబర్ 7న విడుదల అయిన ఖలేజా సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా మహేష్ బాబుకి అక్టోబర్ నెల ఏ మాత్రం కలిసి రాలేదు అనే చెప్పాలి. ఆగస్ట్ లో విడుదల అయిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.