సూపర్‌స్టార్ మహేష్ బాబుతో మహర్షి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆ తర్వాత మళ్లీ మహేష్ తో సినిమా చేసేందుకు వెయిట్ చేసిన వంశీ, చివరి నిమిషంలో సినిమాకు మహేష్ నో చెప్పటంతో ఖాళీగానే ఉండిపోయాడు. కానీ తన తర్వాతి సినిమా ఎప్పుడు, ఎవరితో అనేది ఇంకా వెల్లడించలేదు.
అయితే, కొత్త సినిమా కన్నా ముందు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతుంది. ఓటీటీలలో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనులు మొదలవ్వగా, వచ్చే ఏడాది జనవరి నుండి షూటింగ్ ఉండనుంది.
పలువురు సక్సెస్ ఫుల్ తెలుగు దర్శకులంతా వెబ్ సిరీస్ చేయాలన్న ప్లానింగ్స్ తో ఉన్నారు.