ప్రిన్స్ మహేష్‌బాబు నిర్బంధం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. ఎక్కడికీ కదల్లేని స్థితిలో వున్నారు. దాదాపు ‘నిర్బంధం’లో ఉండిపోయారంటూ అతడి సోషల్ మీడియా టీమ్ చెబుతోంది. ‘భరత్ అనే నేను’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండడంతో మహేష్ ‘ఫిక్స్’ అయిపోయారని, నెలాఖరు దాకా ఆయన ఎక్కడికీ కదిలే పరిస్థితి లేదని క్లారిఫికేషన్ వచ్చేసింది. ‘BAN’ చివరి షెడ్యూల్ బిజీగా సాగుతోందని.. మహేష్ ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని డైరెక్టర్ కొరటాల శివ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. బెజవాడలో ఈనెల 24, 25 తేదీల్లో జరిగే ‘నావీ షో’ ప్రారంభోత్సవానికి మహేష్ బాబు కమిట్ అయ్యారని.. ఆమేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని వార్తలొస్తుంటే.. మహేష్ టీమ్ అవన్నీ అబద్ధాలేనంటూ కొట్టిపారేసింది. ఏప్రిల్ 20న రిలీజయ్యే ‘భరత్ అనే నేను’ మూవీ ప్రమోషన్ కోసం మాత్రమే ప్రిన్స్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అందుబాటులో ఉంటారట.