సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి బరిలో ఉన్న మహేష్… తన సినిమా సూపర్ డూపర్ హిట్ కొడుతుందని ధీమాగా ఉన్నట్లు కనపడుతోంది. ఓవైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందన్న టెన్షన్ ఏమాత్రం లేకుండా… ఫ్యామిలీతో సరదాగా యూరప్ ట్రిప్‌కు వెళ్లిపోయాడు మహేష్.
సంవత్సరానికి రెండు మూడు సార్లు మహేష్ ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. పైగా న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ కూడా ఉండటంతో… వారం రోజుల పాటు యూరప్‌లోనే గడిపేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. జవనరి 3న మహేష్ తిరిగి రాబోతున్నారట. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.