మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతుందని జనం ఎగబడటంతో…. ఒక్కసారిగా తోపులాట జరిగి ఇద్దరు అభిమానులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ చందానగర్‌లో మహేష్ బాబు తన అభిమానులతో ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. అయితే పెద్ద సంఖ్యలో జనం రావటంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఫోటో ఘాట్ కు పోలీసుల ముందస్తు పర్మిషన్ కూడా తీసుకోకపోవటంతో షూటింగ్ ను మధ్యలోనే చందానగర్ పోలీసులు నిలిపివేశారు. దీనితో షూటింగ్ మధ్యలోనే మహేష్ బాబు వెళ్లిపోయారు.
ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమా లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.