సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఫాన్స్ హంగామా కూడా పెరుగుతోంది. మహేష్ బాబు మూవీస్ లో ఈ సినిమా ది బెస్ట్ అనిపించుకునేలా ఉంటుందని టాక్ వినిపిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసిన సరిలేరు నీకెవ్వరు గురుంచే మాట్లాడుకోవడం కనిపిస్తోంది. సంక్రాంతి సెలవులు కూడా తోడవ్వనుడటంతో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులను కొల్లగెట్టే అవకాశముందన్న వార్తలతో ఫాన్స్ కటౌట్లతో హంగామా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో మహేష్ అభిమానులు ప్లెక్సీలతో , కటౌట్లతో హల్చల్ చేస్తున్నారు. సినిమా విడుదల అవ్వకముందే ఇలా ఉంటే సినిమా విడుదల కాబోతున్న శనివారం వారి హంగామా ఎలా ఉండనుందో మరి.