సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సర్కారు వారి పాట. గురువారం రిలీజైన ఈ చిత్రం కు మిశ్రమ స్పందన లభించింది. అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం సినిమా అట్టర్ ప్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మెగా ఘట్టమనేని ఫ్యామిలీల మధ్య చిన్నపాటి యుద్ధం నడుస్తోంది. మెగా హీరోలపై మహేష్ బాబు ఫ్యాన్స్, మహేష్ పై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మహేష్ పని ఎప్పుడో అయిపోయిందని ఏదో అలా సినిమాలను చేస్తూ వస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?
అన్ని సినిమాలలో నటించినా మహేష్ పేస్ లో ఎక్స్ ప్రెషన్స్ కూడా ఉండవని అలాగే కూడా ఒళ్ళు వంచడని, షర్ట్ కూడా నలగనివ్వడని కామెంట్లు చేస్తున్నారు.
దీనికి మహేష్ అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఒళ్లు వంచకపోయినా ఎక్స్ ప్రెషన్ లేకపోయినా, షర్ట్ నలగకపోయినా ఆచార్య కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి ? నైజాం ఏరియాలో మహేష్ బాబు కలెక్షన్స్ ఆచార్య కలెక్షన్ ను ఒకరోజు అడ్వాన్స్ బుకింగ్ తో రీచ్ అయ్యాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఫ్లాప్ మూవీ కాబట్టే తక్కువ టైంలోనే ఓటిటి లో విడుదల చేయటానికి రెడీ అయ్యారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ గొడవ ఎక్కడ వరకూ వెళ్తుందో చూడాలి.