యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ లో రామ్ చరణ్ పాల్గొని అంచనాలు పెంచేటట్టు చేశారు. అయితే రేటింగ్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. షో ప్రారంభమై మూడు నాలుగు వారాలు గడుస్తున్నా… ఇంకా అనుకున్న రీచ్ రాకపోవడంతో రాజమౌళి కొరటాల శివ లను షో కి తీసుకు వచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమోని కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందట. త్వరలోనే ప్రోమో, డేట్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చూస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.