లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. మాములుగా సినిమా షూటింగ్ ల మధ్య గ్యాప్ వస్తే ఎక్కువగా కుటుంబంతోనే గడుపుతుంటారు. ఇప్పుడు షూటింగ్ లు లేకపోవటంతో మొత్తం సమయాన్ని కుటుంబ సభ్యులకే కేటాయించాడు మహేష్ బాబు. తన కూతురు సితార తో మహేష్ చేసే అల్లరి పనులను ఎప్పటికప్పుడు నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా బొమ్మ పట్టుకుని ఓ పాట పాడుతూ తన కూతురు సితారను సినీనటుడు మహేశ్ బాబు కడుపుబ్బా నవ్వించిన సంఘటనను సంబంధించిన ఓ వీడియోను ఆయన భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇంట్లో సితారతో ఆడుకుంటూ మహేశ్ బాబు తీసుకున్న ఈ వీడియో అబ్బురపరుస్తోంది. ‘ప్రేమ, జీవితం, నవ్వులు.. మహేశ్ బాబు, సితార పాప.. ఆయనలోని చిన్నపిల్లాడిని ఆమే బయటకు తీసుకురాగలదు’ అని నమ్రత రాసుకొచ్చింది.
Love, Life and Laughter ❤️ Superstar @urstrulymahesh and #SituPapa 's little teddy concert??
– Video via Namrata's Instagram #SSMBSingsForSitara pic.twitter.com/wsBUJFyJa4— BARaju (@baraju_SuperHit) May 16, 2020