బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ రూ.2.43 కోట్ల కారును గిఫ్ట్ గా ఇచ్చింది. అబ్బా… ఆ కారు తీసుకున్న లక్కీ పర్సన్ ఎవరనేగా మీ డౌట్. అది కూడా కృతినే. తనకు తానే మెర్సిడెస్- మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును గిఫ్ట్ గా ఇచ్చుకుందామె.
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కృతి.. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరింది. ఆదిపురుష్, బచ్చన్ పాండే సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే మెర్సిడెస్ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కృతితోపాటు చాలామంది స్టార్స్ మెర్సిడెస్- మేబాచ్ జీఎల్ఎస్ 600 కారుపై మనసు పడ్డారు. కొద్దిరోజుల క్రితం అర్జున్ కపూర్, జులైలో రణ్ వీర్ సింగ్ కూడా ఇలాంటి కార్లే కొనుగోలు చేశారు.