2019 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన సినిమా ఎఫ్ 2. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించటంతో సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా చేస్తున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. అయితే ఈ సినిమాలో వరుణ్, వెంక్య తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటిస్తున్నారని సమాచారం.
అయితే మహేష్ అతిధి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు అనిల్ రావిపూడి. అయితే మహేష్ బాబు అనిల్ రావిపూడి కంబినేషన్ లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే తరువాత మా ఇద్దరి కంబినేషన్ లో ఇంకో సినిమా ఉంటుందని తెలిపారు.