సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ఏ విధమైన యుద్ధం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఎక్కడ ఎవ్వరికి తగ్గకుండా ఫ్యాన్స్ హీరోల విషయంలో జాగ్రత్త వహిస్తుంటారు. మా హీరో గొప్పంటే… మా హీరో గొప్పంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్రిక్త నెలకొనేలా కత్తులు దూసుకుంటారు. ఇదంతా ఫ్యాన్స్ మధ్య జరిగే ఓ రకమైన క్రీడ. ఇదంతా పక్కకుపెడితే .. ఆ హీరోలంతా ఎంత అన్యోన్యంగా ఉంటారో పలు సందర్భాల్లో నిరూపించారు.
తాజాగా మహేష్ బాబు నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తనకు ట్రిప్ వెళ్లాలని ఉందని చెప్తూ వారితో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టుకున్నాడు. సుదూర ప్రయాణంతో వారితో ఎంజాయ్ చేయాలని ఉందంటూ చెప్పాడు. ఈ ఇద్దరి హీరోలతో మహేష్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. పలు సందర్భాల్లో ఈ ముగ్గురు కలిసి సందడి కూడా చేశారు. ఈ ముగ్గురు హీరోలు టాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.