హీరోలు తాము సంపాదించే డబ్బులన్నీ ఎక్కడ పెడతారు. ఎందులో పెట్టుబడులుగా మారుస్తారు. ఈ విషయంలో ఒక్కో హీరోది ఒక్కో పంథా. నాని తను సంపాదించిన డబ్బులతో సినిమాలు నిర్మిస్తుంటాడు. హీరో ప్రభాస్ ఇల్లు, స్థలాల మీద పెట్టుబడులు పెడతాడు. అల్లు అర్జున్ కైతే రకరకాల వ్యాపారాలున్నాయి. మహేష్ బాబు కూడా ఇంతే.
మొన్నటివరకు రియల్ ఎస్టేట్ లో పెట్డుబడులు పెట్టాడు మహేష్ బాబు. కానీ, ఇప్పుడు తన పంథా మార్చాడు. సినిమా నిర్మాణంలోకి ఎంటరయ్యాడు. ఏషియన్ తో కలిసి మల్టీప్లెక్సుల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్ చైన్ లోకి కూడా ఎంటరవుతున్నాడు ఈ హీరో.
మినర్వా గ్రూప్ తో కలిసి రెస్టారెంట్ బిజినెస్ లోకి ప్రవేశిస్తున్నాడు మహేష్. హైదరాబాద్ లో మినర్వా గ్రూప్ నకు ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. మహేష్ తో కలిసి ఆ పాపులారిటీని ఫైవ్ స్టార్ రేంజ్ కు తీసుకెళ్లాలని భావిస్తోంది. మహేష్-మినర్వా కలిసి బంజారాహిల్స్ లో అత్యాధునిక వసతులతో ఓ లగ్జరీ మినర్వా కాఫీషాప్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు ఒప్పందాలు కుదిరిపోయాయి. కార్యాచరణ కూడా జరిగినట్టు సమాచారం.
మహేష్ ఇలా రెస్టారెంట్ చైన్ బిజినెస్ లోకి ఎంటరవ్వడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టిన ప్రతి రంగంలో లాభాలు అందుకున్నాడు. మినర్వా పార్టనర్ షిప్ కూడా సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు.