స్టార్ హీరోలకు టాలీవుడ్ లో ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం గాని వాళ్ళతో పని చేసే అవకాశం గాని వస్తే చాలా పొంగిపోయే పరిస్థితి ఉంటుంది అనే మాట వాస్తవం. అయితే ఒక నటుడు మాత్రం ఏకంగా మహేష్ బాబుకి డబ్బింగ్ చెప్తూ ఉంటారట. ఆయన ఎవరో కాదు జబర్దస్త్ లో పాపులర్ అయిన బులెట్ భాస్కర్.
ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు. తాను మహేష్ బాబుకి డబ్బింగ్ చెప్తాను అనే విషయాన్ని బులెట్ భాస్కర్ చెప్పారు. సంతూర్ యాడ్ కి గాని, కొన్ని సినిమాల్లో మహేష్ అందుబాటులో లేనప్పుడు తాను డబ్బింగ్ చెప్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. తాను ఎప్పుడూ మహేష్ బాబుని కలవలేదని అన్నారు.
ఇక సర్కారు వారి పాట సినిమాకు గాను తనను అడిగినా సరే కొన్ని కారణాలతో చేయలేదని, మహేష్ బాబుని తప్పకుండా కలుస్తానని చెప్పారు. ఇక వన్ సినిమాలో డైలాగ్ లతో పాటుగా బిజినెస్ సినిమాలో డైలాగ్ కూడా ఆయన చెప్పారు. ఇక మహేష్ బాబు… మాట్లాడితే పక్క వారికి కూడా వినపడకూడదు అని అందుకే ఆయన చాలా స్లో గా మాట్లాడతారని వివరించారు. ఇక మహేష్ బాబు వాయిస్ ముందు ఎలా ఉండేది, తర్వాత ఏ విధంగా మారింది అనేది చెప్పుకొచ్చారు. ఆయన మహేష్ వాయిస్ ఇమిటేట్ చేస్తుంటే అచ్చు మహేష్ బాబు మాట్లాడినట్టే ఉంది.