కాలేయ సంబంధిత వ్యాధితో మృతి చెందారు సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు. శనివారం సాయంత్రం రమేష్ బాబు గచ్చిబౌలి ఏ ఐ జి హాస్పిటల్ లో మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం రమేష్ బాబు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
ప్రస్తుతం పద్మాలయ స్టూడియో కు రమేష్ బాబు పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. రమేష్ బాబు అంత్యక్రియల ఏర్పాట్లను ఘట్టమనేని అధిశేషగిరరావు నిర్వహిస్తున్నారు.
కాగా ఇటీవల కరోనా బారిన పడ్డ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.