కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్త మహేష్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కూడా ఎంతగానో బాధపెట్టింది. అనారోగ్య సమస్యల వల్ల ఇందిరా దేవి మృతి చెందారు. అయితే తన తల్లి చివరి కోరికను మాత్రం నెరవేర్చలేకపోయానని మహేష్ చాలా బాధ పడుతున్నారని సమాచారం.
అది ఏంటి అంటే సితార ఓణీల ఫంక్షన్…. ఆ కార్యక్రమాన్ని చూడాలని ఇందిరా దేవి మహేష్ ను కోరారని తెలుస్తోంది. అయితే మహేష్ వర్క్ విషయంలో బిజీగా ఉండటంతో అమ్మ మాటను పెద్దగా పట్టించుకోలేదు. ఇందిరా దేవి బ్రతికి ఉన్న సమయంలోనే ఈ వేడుకను జరిపించి ఉంటే బాగుండేదని మహేష్ ప్రస్తుతం ఫీలవుతున్నారని సమాచారం.
ఇందిరా దేవి, సితార ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారని నాన్నమ్మకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సితార చూసుకునేదని తెలుస్తోంది. మహేష్ కెరీర్ లో ఈ స్థాయిలో సక్సెస్ సాధించడానికి ఇందిరాదేవి కూడా ఒక విధంగా కారణమని ఆయన చాలా సందర్భాల్లో పేర్కొన్నారు.
తల్లి అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉండటం వల్లే మహేష్ సర్కారు వారి పాట సినిమా రిలీజైన తర్వాత తల్లి పక్కన ఉంటూ ఆమె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునే వారు. మహేష్ బాబు తల్లి మరణం తర్వాత ఎక్కువ సమయం మహేష్ ఒంటరిగానే ఉంటున్నారని సమాచారం.
మహేష్ తాత్కాలికంగా త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ను సైతం పోస్ట్ పోన్ చేశారు. యాక్షన్ సీన్ తో ఈ సినిమా షూట్ మొదలైంది. సితార కూడా నాన్నమ్మతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ ఎమోషనల్ అవుతోంది. కృష్ణ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూ ఉండటం ఫ్యాన్స్ ను సైతం బాధ పెడుతోంది.