టాలీవుడ్ హీరోల్లో అందాల ప్రిన్స్ మహేష్‌బాబు ఫామిలీ ముచ్చటైన కుటుంబం. అమ్మమ్మ, అమ్మ ప్రేమాభిమానాలతో ఎదిగిన మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అడుగుజాడల్లో అటు మూవీల్లో సూపర్. ఇటు వలచిన హీరోయిన్ నమ్రతతో పండంటి కాపురం అదుర్స్. ముద్దుమురిపాలొలికే పిల్లలు గౌతమ్, సితారలకు మహేష్ దంపతులు ఆదర్శ అమ్మానాన్నాలు. ఎల్లప్పుడు, వీలుచూసుకుని ఫామిలీతో హాలిడేస్ తప్పని సరిగా గడిపే మహేష్ టాలీవుడ్ ఫాన్స్ కి ఎంతో ఆదర్శ హీరో.
మహేష్‌కి సినిమా అంటే ప్రాణం. అలాగే మహేష్ మూవీలంటే యూత్ కి భలే అభిమానం. అంతేకాదు వందేళ్ళ బామ్మ కూడా మహేష్ పిచ్చ ఫాన్ అంటే ఇక వింతేముంది. 106 ఏళ్ల రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతికి మహేష్ అంటే వీరాభిమానం. ఆమె గత ఏడాది ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి మహేష్ తో ఫోటో దిగి కుషీ అయింది.
ఇక మహేష్ బిగ్ స్క్రీన్ పై చిరకాలంగా అందంగా కనిపించడంలో సహజ సౌదర్యానికి తోడు మరో సీక్రెట్ ఉంది. అదేమంటే బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు టాప్ హీరో అయినా ఒక్కడే మేకప్ మెన్. పాతికేళ్ళ నుంచి మహేష్ కు మేకప్ చేస్తున్న పట్టాభి పనితీరు అంటే మహేష్ కు చాలా ఇష్టం.
ఇక సోషల్ మీడియాలోనూ మహేష్ బాబుకు యమా ఫాలోయింగ్ ఉంది. మహేష్ ఫేస్ బుక్ ఖాతాను 53 లక్షల మంది లైక్ చేసేస్తున్నారు. ట్విట్టర్లో 8.3 మిలియన్ల మంది, ఇన్ స్టా గ్రామ్ లో 3.6 మిలియన్ల మంది మహేష్ బాబును ఫాలో అవుతున్నారు. ఇంతగా ఫాలోయింగ్ రావడానికి కేవలం మూవీ ఫాలోయింగ్ మాత్రమే కాదు. మహేష్ సామాజిక సేవ కూడా కారణమే. గ్రామాల దత్తత, చిన్నారుల ఆపరేషన్లకు సహకారం ఇలా ఎన్నో మంచి పనులతో అటు ప్రజానీకాన్ని, ఫామిలీని, ఫాన్స్ నీ హృదయంలో హత్తుకునేలా మెప్పిస్తున్న ప్రిన్స్ మహేష్ ..!