సూపర్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. జనవరి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 5 న ఎల్ బి స్టేడియంలో భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఫంక్షన్ కు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నారు. మహేష్ కోరిక మేరకు చిరు వస్తానని చెప్పినట్టు సమాచారం. మెగా స్టార్ చిరంజీవి ని ఆహ్వానించటానికి వెళ్లిన మహేష్ బాబు ఫోటో ని మహేష్ సతీమణి నమ్రత పోస్ట్ చేస్తూ ఒకే రకంగా ఉండే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు….మిగతాదంతా చరిత్రే. ఎల్ బి స్టేడియం…జనవరి 5 గుర్తుపెట్టుకోండంటూ రాసుకొచ్చింది నమ్రత.
ఇక ఈ సంక్రాంతికే వస్తున్న మరో సినిమా అలవైకుంఠపురంలో. అటు మెగా మేనల్లుడు సినిమాకి కాకుండా, మహేష్ సినిమా ఈవెంట్ కి చిరంజీవి వస్తాననటం చర్చనీయాంశంగా మారింది.