కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లు, మల్టిప్లెక్సులన్ని తెరుచుకుంటున్నాయి. నెలల నుండి మూసి ఉన్న మల్టిప్లెక్సులు, థియేటర్లు తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు డిసెంబర్ 11 నుండి తెరుచుకునే అవకాశం ఉంది.
ఇక మహేష్ బాబు ఏఏమ్బీ మాల్ కూడా తెరుచుకుంటున్న నేపథ్యంలో … మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఓ మెసెజ్ ఇచ్చారు. పూర్తి స్థాయి భద్రత, కరోనా ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ మల్టీప్లెక్స్‌ను నిర్వహించబోతున్నట్టు తెలిపాడు. ఏఎమ్‌బీ మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రేక్షకులందరికీ భద్రతతో కూడిన అందమైన అనుభవాన్ని అందించేందుకు ఏఎమ్‌బీ స్టాఫ్ అంతా ఎంతో కష్టపడ్డారు. జాగ్రత్తగా ఉండండి. మీ భద్రతే మా ప్రాధాన్యం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎమ్‌బీ అంటూ ట్వీట్ చేశాడు.
AMB re-opens tomorrow! Proud of our hardworking team at @amb_cinemas and all their efforts from the past few weeks to ensure a safe & enjoyable experience for all movie goers… specially during these times! Stay safe😊 #YourSafetyOurPriority #WelcomeBackToAMB
— Mahesh Babu (@urstrulyMahesh) December 3, 2020
Advertisements