సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన టీజర్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా ట్విట్టర్ వేదికగా సరికొత్త రికార్డ్ సృష్టించాడు మహేష్. ట్విట్టర్ నుంచి ఒక్క పోస్ట్ కి లక్ష కి పైగా లైక్స్ ఉన్న పోస్టులు 30కి పైగా ఉన్న ఏకైక హీరోగా మహేష్ రికార్డు సెట్ చేశాడు. అంతే కాకుండా కొత్త సంవత్సరంకి వేసిన ఫస్ట్ ట్వీట్ కి లక్ష లైక్స్ ని అందుకున్నాడు మహేష్.