సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల ఫోటోలను ఫన్నీ వీడియో లను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు కొడుకు గౌతమ్ 1 నేనొక్కడినే సినిమాలో నటించారు. ఇక సితార ఎంట్రీ మాత్రమే మిగిలి ఉంది. ఇదే విషయమై మహేష్ బాబు ని అడగగా ఆసక్తికరమైన విషయం తెలిపారు.
సితార కు తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదని… ఇంగ్లీష్ సినిమాలు చేయాలనుకుంటుంది అని తెలిపారు. కానీ తెలుగులో ఫ్రోజెన్ కు డబ్బింగ్ చెప్పింది. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాన్నే వాళ్ళకే వదిలిపెట్టాము. నిజాయితీగా చెప్పాలంటే నా కుమార్తెతో నటించడానికి నేను నిజంగా భయపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు.