ప్రస్తుతం కౌంటీ అంతటా బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాల ప్రదర్శనలతో భారతీయ సినిమా అంటే ఏమిటో స్పష్టం అయిందని ప్రిన్స్ మహేశ్ బాబు అన్నారు. అది తనకు సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలిపారు.
పాన్-ఇండియా నటుడిగా ఎదగడం కన్నా దక్షిణాది సినిమాలను దేశ వ్యాప్తంగా విజయవంతం చేయడమే తన ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
తాను ఎప్పుడూ తెలుగు సినిమాలు చేయాలనుకుంటానని వెల్లడించారు. ఆ సినిమాలను దేశంలోని ప్రజలందరూ చూడాలని కోరుకుంటున్నానని, ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.
తెలుగు సినిమాలే తన బలం అని తనకు అభిప్రాయం ఎప్పుడూ ఉండేదన్నారు. ఈ రోజు ఆ భావోద్వేగం చాలా బలంగా ఉందన్నారు. సినిమాలు ఇప్పుడు చాలా పెద్దవిగా మారాయన్నారు. తెలుగు సినిమా ఇప్పుడు భారతీయ సినిమాగా మారిపోయిందని తెలిపారు.