టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను సందిగ్ధంలోకి నెట్టేస్తున్నాడు. మహేష్ బాబు కన్ఫ్యూజ్ చేయడమేంటని అనుకుంటున్నారా..? ఇంతకీ విషయమేంటంటే.. మహేష్ బాబు ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరుతో అదరగొట్టారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మూవీ సక్సెస్‌ను మహేష్ బాబు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలను ఎప్పుడు విడుదల చేస్తే బాగుంటుందనే విషయాన్ని దర్శక నిర్మాతలు బేరీజు వేసుకొని సినిమాను రిలీజ్ చేస్తుంటారు.
సెలవులు, పండగ సమయంలో సినిమాలను విడుదల చేస్తే వసూళ్లు బాగా రాబట్టవచ్చని నిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సంక్రాతి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమా భారీగానే వసూళ్లను రాబట్టింది. సెలవులు కలిసి రావడంతో జనాలు కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్ళి సినిమాను చూసి ఆనందిస్తుంటారు. ఇదిలా ఉండగా… మహేష్ బాబు నెక్ట్స్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా సమ్మర్ లో షూటింగ్ ప్రారంభించి వచ్చే సంక్రాంతి నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు ఎలా కనిపించనున్నారనే విషయంలో క్లారిటి లేకపోయింది. మహేష్ బాబు జేమ్స్ బాండ్ తరహాలో కనిపిస్తారని మొదట ప్రచారం జరిగింది. ఆ తరువాత గూఢచారి పాత్రలో కనిపిస్తారని మరో ప్రచారం కూడా జరిగింది. తాజా సమాచారం మేరకు మహేష్ బాబు వంశీ పైడిపల్లితో చేస్తోన్న సినిమాలో గ్యాంగ్ స్టార్ మూవీ అని చెబుతున్నారు. ఈ సినిమాలో పర్యావరణ రక్షకుడిగా మహేష్ బాబు గ్యాంగ్ స్టార్ గా కనిపించారనున్నారని తెలుస్తోంది. మొత్తానికి మహేష్ బాబు చేయబోతున్న సినిమాలో ఏ పాత్రలో కనిపించారనున్నారని అభిమానులు మల్లాగుల్లాలు పడుతున్నారు.