ఆయన నటన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఆయన అనుభవం అంతా లేదు నా వయసు అంటూ మహేష్ బాబు చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ మహేష్ ఏ నటుడి గురించి అన్నారో తెలుసుకుందామా…!
యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ ముందు అదరగొట్టింది. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు మూవీ అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రాన్నివీక్షించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఏ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్’ అని ట్వీట్ చేశారు. “బ్లాక్‌బస్టర్ సినిమా. మైండ్ బ్లోయింగ్. అదిరిపోయింది. లోకేశ్ కనగరాజ్.. నేను మిమ్మల్ని కలిసి.. విక్రమ్ మొదలైనప్పటినుంచి చివరి వరకు చిత్రీకరణ ఎలా జరిగిందో తెలుసుకుంటా. ఇక లెజెండరీ యాక్టర్ కమల్‌హాసన్ నటన గురించి మాట్లాడే అర్హత నాకు ఇంకా రాలేదు! నా అనుభవం కూడా సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆయన అభిమానిని అయినందుకు చాలా గర్వంగా ఉంది.
ఇందులో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి నటనలో మెరుపులు కనిపించాయి. ఇక అనిరుధ్ కెరీర్ బెస్ట్ మ్యూజిక్ అందించారు” అంటూ మహేశ్ రాసుకొచ్చారు.కమల్‌హాసన్ విక్రమ్‌పై మహేశ్ ప్రశంసలుకాగా, విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో సూపర్ రికార్డును అందుకుంది. తాజాగా 400కోట్ల క్లబ్లో చేరింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘రోబో 2.0’ తర్వాత ఈ అరుదైన ఘనత రెండొవ తమిళ చిత్రంగా నిలిచింది.