సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను కూడాచిత్ర యూనిట్ విడుదల చేసింది.
అయితే ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు ప్రారంభం అవుతుండటంతో సర్కారు వారి పాట చిత్ర యూనిట్ కూడా షూటింగ్కు సిద్ధమవుతోందని సమాచారం. అయితే ఈ సినిమా కు సంబంధించి కొంత భాగం అమెరికాలో షూట్ చేయాల్సి ఉందట. అందుకు గాను అమెరికాలోని డెట్రాయిట్ లో చిత్రీకరణ నిర్వహించాలని ఫిక్స్ అయినట్టు తాజా సమాచారం. దీంతో దర్శకుడు, కెమేరా మేన్ త్వరలో డెట్రాయిట్ కు వెళ్లి లొకేషన్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది. అలాగే ముందుగా మహేశ్ లేని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించే ప్లాన్ చేస్తున్నారట. కరోనా పరిస్థితులు కుదుట పడ్డాక మహేశ్ అమెరికాకు వెళతాడని అంటున్నారు.