భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రంకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి.
అయితే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చూశారు. ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని షేర్ చేస్తూ… పవన్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ… ఆకాశానికి ఎత్తేశారు.
అలాగే రానా దగ్గుబాటి డేనియల్ శేఖర్ గా సంచలనం సృష్టించాడు. వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్!! అంటూ మరో ట్వీట్ చేశాడు. అలాగే త్రివిక్రమ్‌పై రచన ఎప్పటిలాగే పదునైనది, తెలివైనది… ఇటీవలి కాలంలో ఉత్తమమైనది కూడా అంటూ చెప్పుకొచ్చాడు.
చివరగా థమన్… థమన్ సంగీతం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుందంటూ చెప్తూనే డైరెక్టర్ సాగర్ కె చంద్ర, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లకు అభినందనలు తెలిపారు.
Stunning visuals by @dop007.. one of my favourite lensmen!! Lastly, the music score by @MusicThaman haunts you and leaves you spellbound!! Sensational!!
Congratulations to @saagar_chandrak, @vamsi84 and the entire team!! @MenenNithya @iamsamyuktha_ @SitharaEnts
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2022
#BheemlaNayak is riveting, intense and electrifying! @PawanKalyan is in blazing form 🔥🔥🔥 what a performance!! @RanaDaggubati is sensational as 'Daniel Sekhar'.. what a screen presence!! 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2022