ప్రిన్స్ మహేష్ బాబు, రష్మిక జోడీ సరిలేరు నీకెవ్వరు అంటూ సంక్రాంతికి సందడికి రెడీ అయ్యారు. జనవరి 12న సరిలేరు నీకెవ్వరు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో మహేష్ బాబు మిలటరీ గెటప్ లో ఆర్మీ అధికారి అజయ్ కృష్ణగా ఫాన్స్ తో పాటు ప్రేక్షకులందరినీ మెప్పించేందుకు సిద్ధమయ్యాడు.
సరిలేరు నీకెవ్వరు విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. ‘ఈ సంక్రాంతి నాకు ఎంతో ప్రత్యేకం కాబోతోంది. ధన్యవాదాలు’ అనిల్ రావిపూడి అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడంటే ఈ మూవీ ఎంత బాగా వచ్చిందో ఊహించుకోవచ్చు.
ఇటీవలే హాలిడే ట్రిప్ ముగించుకుని వచ్చిన హీరో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అదనపు హంగు జోడిస్తోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ సంయుక్త పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.