మహేష్ బాబు, రష్మిక మందన హీరో , హీరోయిన్లుగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదట భారీగా వసూళ్లను చేసినప్పటికీ క్రమంగా కలెక్షన్స్ పడిపోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా.. అసలు సినిమాకు ఊహించిన స్థాయిలో ఆదరణ దక్కపోవడానికి రష్మికనే కారణమట. ఈ వార్త రష్మికకు చేరడంతో ఆమె అప్సెట్ అయినట్లు ప్రచారం సాగుతోంది.
సినిమాను ప్రచారం చేసినంతగా కథలో దమ్ములేదని రివ్యూల్లో తేలింది. సినిమాకు హైలెట్ గా నిలవనుందని భావించిన ట్రైన్ సీన్, క్లైమాక్స్ సీన్, ఇక దేవీ శ్రీ ప్రసాద్ కూడా బాణీలు అంతగా ఆకట్టుకునేలా లేవని విమర్శలు వచ్చాయి. సినిమా చూసిన వారంతా ప్రచారం చేసినంతగా సినిమాను తెరకెక్కించలేకపోయారని పేర్కొంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు ఏవైనప్పటికీ రష్మిక వల్లే సినిమాకు నష్టం జరిగిందని ప్రచారం జరుగుతుండటంతో ఆమె మనస్థాపానికి గురయ్యారని సమాచారం.
అయితే సినిమాలో హీరోయిన్ రష్మిక అతి ప్రవర్తనే సినిమాకు మైనస్ గా మారిందని అంటున్నారు. ఆమె క్యారెక్టర్ ను దర్శకుడు అలా మలిచినప్పుడు ఆమె మాత్రం ఎం చేయగలదు..?