సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఓవర్సీస్‌లో దుమ్ములేపుతోంది. ప్రిమియర్ షోలతోనే మహేష్ అరుదైన రికార్డు క్రియేట్ చేయగలిగారు. డల్ మార్కెట్ ఉండే అమెరికాలో సైతం మహేష్ నెట్టుకొస్తుండటం విశేషం. తొలిరోజే ప్రిమయర్ షోల ద్వారా 5వేల డాలర్ల మార్క్‌ను రీచ్ అయ్యాడు మహేష్. అయితే ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనపడుతోంది. సరిలేరు నీకెవ్వరు మూవీతో మహేష్ మొదటిరోజే ఓవర్సీర్‌లో ఇంత కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్ 15 సినిమాల జాబితాలో చేరిపోయాడు.
Advertisements
సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ రివ్యూ
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు వీకెండ్ వస్తుండటంతో తన కలెక్షన్స్‌ను ఓవర్సీస్‌లో మరింత పెంచుకోబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.