సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం దుబాయ్ లో ఈ మూవీ షూట్ శరవేగంగా సాగుతోంది. ఈనెల 21న దుబాయ్ షెడ్యూల్ పూర్తికాబోతుండగా, అదే రోజు సాయంత్రం చిత్ర యూనిట్ హైదరాబాద్ రాబోతుంది. అయితే, దర్శకుడు పరశురాం ప్రేక్షకులకు ఓ చిన్న సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సినిమాపై భారీ అంచానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచేలా వరుసగా మూవీ అప్డేట్, షార్ట్ వీడియోస్ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. అందులో భాగంగానే దుబాయ్ షెడ్యూల్ విశేషాలను తెలుపుతూ ఓ షార్ట్ వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు ఫిలింనగర్ టాక్.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో గీత గోవిందం డైరెక్టర్ పరశురాంతో ఈ సినిమా రాబోతుంది. పూజా హెగ్ధే లీడింగ్ లేడీకాగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.