టాలీవుడ్ లో సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యాక… ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాలన్నీ రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో రిలీజ్ అయ్యే సినిమాలకు డేట్స్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తున్నారు.
ఇటీవలే దుబాయ్ లో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూట్ మొదలైంది. కరోనాతో ఈ చిత్ర యూనిట్ చాలా ఇబ్బందులే పడింది. షూట్ ప్రారంభం కావటంతో నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. సంక్రాంతి-2022కు మూవీ రిలీజ్ ఉంటుందని సినిమా నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి షూట్ పూర్తయ్యే అవకాశం ఉంది.
థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.