భారీ అంచనాల మధ్య మొదలైన సర్కారు వారి పాట షూటింగ్ ఒక్క అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతుంది. రెండు నెలల లాంగ్ షెడ్యూల్ ప్లాన్స్ తో అమెరికా వెళ్లాలనుకున్న చిత్ర యూనిట్ టూర్… ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే లోకేషన్స్ ఫైనల్ చేసుకొని ఇండియాకు తిరిగొచ్చిన దర్శకుడు పరశురాం, జనవరిలో షెడ్యూల్ ప్లాన్ చేశారు.
కానీ, అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా… టూర్ మళ్లీ వాయిదా పడింది. లెటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏప్రిల్ నెలలో టూర్ ఉండే అవకాశం ఉంది. సర్కారు వారి పాటలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.