సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, టీజర్ అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం సినీఅభిమానులు…మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజానికి జనవరి మొదటి వారం లోనే ఈ సాంగ్ రావాల్సి ఉంది. కానీ తర్వాత సంక్రాంతికి వాయిదా వేశారు.అయితే ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి మరో కీలక అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
జనవరి 26న ఈ సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారట. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లష్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.