సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారు పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచే ఓ యాక్షన్ సన్నివేశాన్ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.
కాగా ఆ సీక్వెల్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుల్లెట్ బండి పై స్టైలిష్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తున్నారు. ఇక మరి ఆ యాక్షన్ సీన్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.