అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే గిఫ్ట్ వచ్చేసింది. పరశురాం దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.
టైటిల్‌ను జస్టిఫై చేసేలా.. మహేష్ బాబు కాయిన్‌ని గాల్లోకి ఎగిరివేసే సీన్‌ను ఈ మోషన్ పోస్టర్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. మహేష్ బాబు చేతికి ఓం అనే లాకెట్ ఇందులో కనిపిస్తోంది. అవినీతికి సంబంధించిన సామాజిక అంశం ప్రధానంగా ఈ మూవీ సాగుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా అనుకుంటున్నారు.