సూపర్ స్టార్ మహేష్ బాబు తన మంచి హృదయాన్ని చాటుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులకు వైద్య సహాయం చేసి గొప్ప వ్యక్తిగా నిలిచాడు. ఇక తాజాగా మరో ప్రాణం ను మహేష్ బాబు నిలబెట్టాడు. ఇదే విషయమై చెప్తూ నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీపావళి పర్వదినాన టపాసులను కాల్చడానికి బదులుగా ఒక మొక్క నాటితే కాలుష్యాన్ని కాస్తయినా తగ్గించవచ్చని ఆమె అన్నారు.
మరోవైపు ఆపరేషన్ చేయించుకున్న చిన్నారితో పాటు తల్లి ఫోటోను పోస్ట్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉందని, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని నమ్రత పోస్ట్ లో పేర్కొంది.